ఓటీటీలోకి 'బింబిసారుడు' వచ్చేశాడోచ్‌

Bimbisara Movie is streaming on Zee5 OTT.నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన చిత్రం బింబిసార‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2022 9:50 AM IST
ఓటీటీలోకి బింబిసారుడు వచ్చేశాడోచ్‌

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన చిత్రం 'బింబిసార‌'. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈచిత్రం ఆగ‌స్టు 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోవ‌డంతో పాటు పెద్ద ఎత్తున క‌లెక్ష‌న్లు సాధించింది. క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు.

బింబిసారుడు, దేవ‌ద‌త్తుడి గా ద్విపాత్రాభిన‌యంలో క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌నకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5లో అర్థ‌రాత్రి నుంచి బింబిసార సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సంయుక్తమీనన్‌, కేథరిన్‌ ట్రెసా క‌థానాయిక‌లుగా న‌టించ‌గా.. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి బాణీలు సమకూర్చారు.

Next Story