ఎగ్జైటింగ్‌గా 'బిగ్‌బాస్‌ 7' ప్రోమో.. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌'అంటూ..

ఇప్పటి వరకు ఆరు సీజన్లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌ బాస్‌'.. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్స్‌తో ఏడో సీజన్‌కు సిద్ధమైంది.

By అంజి  Published on  19 July 2023 8:56 AM IST
Biggboss 7, Biggboss Promo, Nagarjuna, Entertainment

ఎగ్జైటింగ్‌గా 'బిగ్‌బాస్‌ 7' ప్రోమో.. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌'అంటూ.. 

ఇప్పటి వరకు ఆరు సీజన్లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌ బాస్‌'.. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్స్‌తో ఏడో సీజన్‌కు సిద్ధమైంది. 'స్టార్ మా' ఛానెల్‌లో బిగ్‌బాస్ టెలికాస్ట్ కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది.

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ప్రోమో ఆడియెన్స్​లో అంచనాలను పెంచేస్తోంది. గత నాలుగు సీజన్లు హోస్ట్‌ చేసిన హీరో నాగార్జుననే.. ఈ సారి కూడా హోస్ట్‌ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో నాగార్జున చేతిలో పాప్ కార్న్ పట్టుకొని బిగ్‌బాస్ సీజన్ 7 వచ్చేస్తుంది. ఈ సారి కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అంటూ చెప్పారు. దీంతో ఈ షో పై ఆడియన్స్​కు మరింత ఆసక్తి పెంచారు. ఈ సారి డిఫరెంట్‌గా బిగ్‌బాస్‌ సీజన్‌ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఓ కొత్త కాన్సెప్ట్​తో రానున్నట్లు ఆయన ఓ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ప్రోమో ట్రెండింగ్‌లో ఉంది.

Next Story