బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5.. కంటెస్టెంట్లు వీళ్లేనా..?

Biggboss 5 Telugu season contestants list going viral.ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2021 1:15 PM IST
బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5..   కంటెస్టెంట్లు వీళ్లేనా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. ఏ భాష‌లోనైనా అభిమానులు ఈ షోకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక తెలుగులో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ఐదో సీజ‌న్లోకి అడుగుపెడుతోంది. ఇప్ప‌టికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక వంటివి తుది ద‌శ‌కు చేరుకున్నాయి. తాజాగా ఈ షోకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈసారి బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌ 5 పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కొన్ని పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సారి యాంకర్‌ వర్ణిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితలో ఉన్న వారు వ‌స్తారో లేరో ఇప్ప‌టికైతే క్లారిటీ లేక‌పోయిన‌ప్ప‌ట‌కి.. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన పూర్తి స‌మాచారం రానుంది.

Next Story