పార్టీ పేరు ప్రకటించిన వీజే సన్నీ.. ఇంతకీ అది ఏం పార్టీనో తెలుసా?

వీజే సన్నీ.. తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. అయితే అదీ పొలిటికల్‌ పార్టీ కాదు. అది త‌న సినిమా టైటిల్ 'సౌండ్ పార్టీ'.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2023 11:58 AM IST
Bigg Boss winner VJ Sunny, Sound party, Tollywood news

పార్టీ పేరు ప్రకటించిన వీజే సన్నీ.. ఇంతకీ అది ఏం పార్టీనో తెలుసా? 

బిగ్‌ బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ.. తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. మంగ‌ళ‌వారం స‌న్నీ ఏదో పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ ఒక వీడియో షేర్ చేసి...అంద‌ర్నీ షాక్ కి గురి చేశాడు. అయితే అందరూ అనుకున్నట్టు అదీ పొలిటికల్‌ పార్టీ కాదు. అది త‌న సినిమా టైటిల్ 'సౌండ్ పార్టీ'. సినీ జ‌ర్న‌లిస్టుల చేతుల మీదుగా వి.జె.సన్నీ హీరోగా నటిస్తోన్న `సౌండ్ పార్టీ` టైటిల్ లోగో నిన్న లాంచ్‌ అయ్యింది. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్ర‌య‌త్నంగా బిగ్ బాస్ - 5 టైటిల్ విన్నర్ వి.జె.సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్న కొత్త సినిమా ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పణలో టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్ శేరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సార‌థి స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను జ‌ర్న‌లిస్ట్‌ల చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా హీరో వి.జె స‌న్ని మాట్లాడుతూ..``నేను పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ చేసిన వీడియోకు చాలా మంది నుంచి ఫోన్స్ వ‌చ్చాయి. `సౌండ్ పార్టీ` టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మీడియా మిత్రుల చేతుల మీదుగా మా సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత యుఎస్ లో ఉంటూ కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా పూర్తి చేయ‌డానికి స‌హ‌క‌రించారు. మా ద‌ర్శ‌కుడు సంజ‌య్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా సినిమా తీశాడు. జ‌య‌శంక‌ర్ అన్నీ తానై సినిమాను న‌డిపించాడు. క‌చ్చితంగా 'సౌండ్ పార్టీ' థియేట‌ర్ లో గ‌ట్టిగా సౌండ్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నా`` అన్నారు.

30 ఇయ‌ర్స్ పృథ్వీ మాట్లాడుతూ...``స‌న్నీతో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. ఎమ్మెల్యే గా న‌టిస్తున్నా. ద‌ర్శ‌కుడు ఎంతో క్లారిటీగా చెప్పి మాతో వ‌ర్క్ చేయించుకున్నాడు. ర‌విగారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. వి.జ‌య‌శంక‌ర్ తెర‌ వెనకుండి ఎక్క‌డా ఎటువంటి స‌మ‌స్య రాకుండా సినిమాను ముందుకు న‌డిపించారు`` అన్నారు. ఈ సినిమాలో శివ‌న్నారాయ‌ణ , అలీ, సప్తగిరి, థర్టీఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డితో పాటు త‌దితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ జి. అవినాష్, సంగీతం మోహిత్ రెహమానిక్, పాట‌లు పూర్ణచారి పని చేస్తున్నారు. ఈ సినిమాను ప్రొడ్యూసర్, భువన్ సాలూరు,నిర్మాత రవి పోలిశెట్టి నిర్మిస్తున్నారు.

Next Story