బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 వచ్చేస్తోంది.. లోగో చూశారా..?

Bigg Boss Telugu season 6 logo unveile.తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 4:18 AM GMT
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 వచ్చేస్తోంది.. లోగో చూశారా..?

తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వివిధ రకాల మనుషులు, వ్యక్తిత్వాలు, టాస్క్‌లు ఒక్కటేమిటి అన్ని రకాలుగా బిగ్‌బాస్ షో ఆకట్టుకోవ‌డంతో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఇప్ప‌టికే తెలుగులో ఐదు సీజ‌న్లను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగా.. ఓటీటీ వేదిక‌గా ఒక సీజ‌న్ పూర్తైంది. బుల్లితెర‌పై ఆరో సీజ‌న్ ఎప్పుడెప్పుడు మొద‌లు అవుతుందా అని ఎంతో అతృత‌గా ఎద‌రుచూస్తున్న వారికి బిగ్‌బాస్ టీమ్ శుభవార్త చెప్పిది.

ఆరో సీజన్‌కు సంబంధించిన లోగో వచ్చేసింది. లోగో చూస్తుంటే ఎంతో క్రియేటివిటీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తొలి సీజ‌న్‌కు ఎన్టీఆర్, రెండో సీజ‌న్‌కు నాని వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. 3,4,5 సీజన్ల‌కు కింగ్ నాగార్జున హోస్టింగ్ చేశారు. ఆరో సీజ‌న్‌కు సైతం నాగార్జున‌నే వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇక ఈ సీజ‌న్ ఎప్పుడు మొద‌లు కాబోతుంద‌నే వివ‌రాలు అయితే వెల్ల‌డించ‌లేదు కానీ.. త్వ‌రలోనే తీసుకువ‌చ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబ‌ర్ మొద‌టి లేదా రెండో వారంలో ఆరో సీజ‌న్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. మ‌రీ ఈ సీజ‌న్‌లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారు..? బిగ్‌బాస్ వారితో ఏ ఏ ఆట‌లు ఆడిస్తారు..? మొత్తంగా షో ఎలా ఉండ‌బోతుంది అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్లలో విజేతలు వీరే..

తొలి సీజన్‌లో శివ భాలాజి,

రెండో సీజ‌న్‌లో కౌశల్,

మూడో సీజన్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్,

నాలుగో సీజన్‌లో అభిజీత్,

ఐదో సీజన్‌లో సన్నీ

బిగ్‌బాస్ ఓటీటీ షో బింధుమాదవి లు గెలిచారు.

Next Story
Share it