బిగ్‌బాస్ సీజ‌న్ 5.. ఎప్పుడు ప్రారంభం కానుందంటే..?

Bigg Boss telugu season 5 update.బిగ్ బాస్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన షో. తెలుగులో ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2021 8:07 AM IST
బిగ్‌బాస్ సీజ‌న్ 5.. ఎప్పుడు ప్రారంభం కానుందంటే..?

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన షో. తెలుగులో ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఐదో సీజ‌న్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా నాలుగో సీజ‌న్ ఆల‌స్యంగా మొద‌లైన‌ప్ప‌టికి అనూహ్యా విజ‌యాన్ని అందుకుంది. దీంతో ఆ సీజ‌న్ పూర్తైన నెల రోజుల అనంత‌రం నిర్వాహ‌కులు ఐదో సీజ‌న్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇప్ప‌టికే వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 'మీరు బిగ్‌బాస్ షో'ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన రావడంతో త్వరలోనే బిగ్‌బాస్ 5 సీజన్‌ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఇప్ప‌టికే కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తి అయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తుండ‌డంతో ఈ సారి కూడా ఆల‌స్యంగానే మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టులో ఐదో సీజ‌న్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాకాలు చేస్తున్నారు. అప్ప‌టికి క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని బిగ్‌బాస్ నిర్వాహ‌కులు బావిస్తున్నారు. గతేడాది మాదిరిగానే కంటెస్టెంట్స్‌ను ముందుగా క్వారంటైన్‌ ఉంచనున్నారని సమాచారం. ఇప్ప‌టికే ఐదో సీజ‌న్‌లో పాల్గొనే వారి జాబితా ఇదేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. తుది జాబితాలో ఆ కంటెస్టెంట్లే ఉంటారో లేదో తెలియాల్సి ఉంది. గ‌త రెండు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన నాగార్జున నే ఈ ఐదో సీజ‌న్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.




Next Story