బిగ్‌బాస్ తెలుగు.. 5 రెట్ల ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ట‌న్నుల్లో కిక్‌

Bigg Boss Telugu season 5 starts from Today.బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 కోసం బుల్లితెర‌ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2021 6:51 AM GMT
బిగ్‌బాస్ తెలుగు.. 5 రెట్ల ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ట‌న్నుల్లో కిక్‌

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 కోసం బుల్లితెర‌ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్లు స‌క్సెస్స్ పుల్‌గా కంప్లీట్ చేసుకుంది. నేటి నుంచి ఐదో సీజ‌న్ ప్రారంభం కానుంది. మూడు, నాలుగు సీజన్లు హోస్ట్ చేసి ఆకట్టుకున్న నాగార్జున మ‌రోసారి అల‌రించేందుకు సిద్దం అయ్యాడు. ఇన్నాళ్లు ఈ కార్య‌క్ర‌మానికి సంభందించి వ‌స్తున్న వార్త‌లు అన్నింటికీ తాజాగా ప్రొమోతో బ్రేక్ ప‌డింది. నేటి సాయంత్రం 6గంట‌ల‌కు లాంచింగ్ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుండ‌గా.. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ను నిన్న‌నే పూర్తి చేశారు.

తాజాగా ఓ ప్రొయోను విడుదల చేశారు. ఓ గొప్ప రోజు.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఐదింత‌లు.. కిక్ ట‌న్నుల్లో వ‌స్తుంద‌ని అంటూ చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ హౌస్ కూడా కొత్త‌గా డిజైన్ చేసిన‌ట్లు ఆ ప్రొమోలో క‌నిపిస్తుంది. కాగా.. ఈ షో సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ప్ర‌తి రోజు రాత్రి 10గంట‌ల‌కు, శ‌ని, ఆదివారం మాత్రం రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.

ఈ సీజ‌న్ పైన‌ల్ లిస్ట్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో కొంద‌రి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 1. యాంక‌ర్ ర‌వి, 2. యాంక‌ర్ వ‌ర్షిణి, 3. యాక్ట‌ర్ ప్రియ 4. వ‌ర్ధ‌మాన న‌టి ల‌హ‌రి షారి 5. జ‌బ‌ర్ధ‌స్త్ ప్రియాంక 6. సిరి హ‌న్మంతు 7. సింగ‌ర్ రామ‌చంద్ర 8. సెవెన్ ఆర్ట్స్ సరయు 9 దీపక్ సరోజ్ 10. వర్థమాన నటి శ్వేతా వర్మ 11 షణ్ముఖ్ జస్వంత్ 12 నటరాజ్ మాస్టర్ 13. టెలివిజన్ యాక్టర్ సన్నీ 14 టెలివిజన్ నటుడు మానస్ షా 15 టెలివిజన్ నటి ఉమాదేవి (కార్తీకదీపం ఫేమ్) 16 మోడల్ జస్వంత్ 17 ఆర్జే కాజల్ 18 యూట్యూబర్ లోబో 19 లహరి షారి ఉన్నారు. మ‌రీ వీరిలో ఎంత మంది బిగ్‌బాస్ సీజ‌న్ 5 లో పాల్గొన‌నున్నారో తెలియాలంటే మ‌రికొద్ది గంట‌లు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Next Story