బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
Bigg Boss Telugu season 5 starts from september 5th.బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న
By తోట వంశీ కుమార్ Published on
26 Aug 2021 7:13 AM GMT

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5కి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఏ తేదీన ఏ సమయానికి ప్రారంభం అవుతుందో చెప్పేశారు నిర్వాహకులు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. చెప్పండి బోర్ డమ్ కు గుడ్ బై.. వచ్చేస్తుంది సీజన్ 5 అంటూ ఈ ప్రోమోలో నాగార్జున డైలాగ్‌తో అలరించారు. ఇక ఈ షో సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం కానుండగా.. శని, ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ షోప్రసారం కానుంది.
ఇదిలా ఉంటే.. కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందమంది పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ క్వారంటైన్ కి వెళ్లే వారి పేర్లుగా ఇప్పటికే బయటకి వచ్చేయగా.. సింగర్ కోమలితో పాటు వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
Next Story