బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి

Bigg Boss Telugu OTT winner Bindu Madhavi.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత‌గా బిందు మాధ‌వి నిలిచింది. శ‌నివారం రాత్రి ఈ షో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 May 2022 3:50 AM GMT
బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి

బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత‌గా బిందు మాధ‌వి నిలిచింది. శ‌నివారం రాత్రి ఈ షో వ్యాఖ్యాత నాగార్జున.. బిందు మాధ‌విని విజేతగా ప్ర‌క‌టించారు. చివ‌రి వ‌ర‌కు న‌టుడు, వ్యాఖ్యాత అఖిల్ సార్థ‌క్ తీవ్ర పోటీ ఇచ్చిన‌ప్ప‌టికీ బిందు మాధ‌వి విజేత‌గా నిలిచి ట్రోఫీతో పాటు రూ.40ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ని సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ తెలుగు వెర్ష‌న్‌లో ఓ మ‌హిళ బిగ్ బాస్ విన్న‌ర్‌గా నిల‌వ‌డం ఇదే తొలిసారి.

బుల్లితెర‌పై ఐదు సీజ‌న్ల‌ను స‌క్సెస్ పుల్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో..తొలిసారి 'నాన్ స్టాప్' అంటూ ఓటీటీలో ప్రారంభ‌మైంది. 18 మందితో మొదలైన ఈ షో 83 రోజులు సాగి చివరకు 7 గురు కంటెస్టెంట్స్(బాబా భాస్కర్‌, అనీల్ రాథోడ్, మిత్రా శర్మ, అరియానా గ్లోరి, యాంకర్ శివ, అఖిల్‌ సార్థక్, బిందు మాధవి) ఫైన‌ల్ చేరుకున్నారు. 7గురిలో ఒక్కొక్క‌రిని ఎలిమినేట్ చేసుకుంటూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో అరియానా గ్లోరి రూ.10ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకుని టైటిల్ రేసు నుంచి స్వ‌యంగా త‌నే త‌ప్పుకుంది. చివ‌ర‌కు అఖిల్‌ సార్థక్, బిందు మాధవి మిగిలారు.

అయితే.. బిందు మాధ‌వికి ఓ అంశం బాగా క‌లిసి వచ్చింద‌ని చెప్పాలి. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఆమె ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఈ క్ర‌మంలో అఖిల్‌కు తెలుగు ప్రేక్ష‌కుల నుంచే మ‌ద్ద‌తు రాగా.. బిందు మాధ‌వికి మాత్రం తెలుగుతో పాటు త‌మిళం నుంచి కూడా భారీ ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. దీంతో అఖిల్‌ను వెన‌క్కు నెట్టిన బిందు మాధ‌వి విజేత‌గా నిలిచింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఏదీ ఏమైనా బిందు మాధవి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

Next Story
Share it