ట్విస్టుల మీద ట్విస్టులు.. తొలి వారం నామినేష‌న్‌లో ఉంది వీరే

Bigg Boss Telugu 6 These Contestants Nominated in Week 1.బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6లో తొలి వారం నామినేష‌న్స్‌లో ఉంది వీరే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sep 2022 4:18 AM GMT
ట్విస్టుల మీద ట్విస్టులు.. తొలి వారం నామినేష‌న్‌లో ఉంది వీరే

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 స‌రికొత్త‌గా ఉంటుంద‌ని ఈ షో ప్రారంభానికి ముందే హోస్ట్ నాగార్జున చెప్పిన సంగ‌తి తెలిసిందే. నాగ్ చెప్పిన‌ట్లుగానే ఈసారి నామినేష‌న్స్‌ను సోమ‌వారం నుంచి బుధ‌వారానికి మార్చేశారు. తొలి వార‌మే హౌస్‌లో రచ్చ ర‌చ్చ మొద‌లైంది. కపుల్ మెరీనా-రోహిత్ ల మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లు మొద‌లు అయ్యాయి. నాకు టైం కేటాయించడం లేదు, హగ్ ఇవ్వడం లేదు కిస్ ఇవ్వడం లేదని మెరీనా భాదపడటం అందుకు రోహిత్ స‌ర్దిచెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి స‌భ్యులు రెచ్చిపోయారు.

నామినేష‌న్ విష‌యానికి వ‌స్తే.. ట్రాష్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ నేరుగా నామినేట్ కాగా.. క్లాస్‌లో ఉన్న గీతు, ఆదిరెడ్డి, నేహా చౌదరిలు సేఫ్ అయ్యారు. మాస్ టీమ్‌లో మిగిలిన స‌భ్యులు నామినేష‌న్‌లో పాల్గొన్నారు. ఇక్క‌డే బిగ్‌బాస్ ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చాడు. జంట‌గా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్‌ లలో ఏ ఒక్కరిని నామినేట్ చేసినా.. ఇద్దరూ నామినేట్ అవుతార‌ని, ఒక‌వేళ ఎలిమినేట్ అయినా ఇద్ద‌రూ క‌లిసే బ‌య‌ట‌కు వెలుతార‌ని చెప్పాడు.

బాలాదిత్య‌, ఇనయ, అభినయ శ్రీ, సింగర్ రేవంత్, జబర్దస్త్ ఫైమా, శ్రీ సత్య, చలాకీ చంటి నామినేష‌న్స్‌లోకి వ‌చ్చారు. నామినేష‌న్ తంతు ముగిసే స‌మ‌యంలో మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ట్రాష్ స‌భ్యుల్లో ఒక‌రిని సేవ్ చేసే అవ‌కాశాన్ని క్లాస్‌లో ఉన్న వారికి ఇచ్చారు. దీంతో బాలాదిత్య‌ను సేఫ్ చేసి ఆ స్థానంలో అరోహిని పంపించారు. చివ‌రికి తొలి వారం నామినేష‌న్‌లో ఆరోహి, ఇనయ, అభినయ శ్రీ, సింగర్ రేవంత్, జబర్దస్త్ ఫైమా, శ్రీ సత్య, చలాకీ చంటిలు ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎమినేట్ అవుతారో చూడాలి మ‌రీ.

Next Story