చివ‌రి నిమిషంలో బిగ్ ట్విస్ట్‌.. మూడో వారం ఎలిమినేట్ అయ్యింది ఎవ‌రంటే

Bigg Boss Telugu 6 Neha Chowdary gets evicted from the show.బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 తొలి రెండు వారాలు చ‌ప్ప‌గా సాగినా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sept 2022 12:16 PM IST
చివ‌రి నిమిషంలో బిగ్ ట్విస్ట్‌.. మూడో వారం ఎలిమినేట్ అయ్యింది ఎవ‌రంటే

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 తొలి రెండు వారాలు చ‌ప్ప‌గా సాగినా.. మూడో వారానికి వ‌చ్చే స‌రికి షో ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రెండో వారం డ‌బుల్ ఎలిమినేష‌న్‌తో షానీ, అభిన‌య‌లు హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. కాగా.. మూడో వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా..? అన్న విష‌యంలో ఆస‌క్తి నెల‌కొంది.

ఈ వారం నామినేష‌న్‌లో చంటి, ఆరోహి, వాసంతీ కృష్ణ‌న్‌, బాలాదిత్య‌, నేహా చౌద‌రి, ఇన‌యా సుల్తానా, శ్రీహాన్‌, రేవంత్‌, గీతూ రాయ‌ల్ తో క‌లిపి మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో రేవంత్, గీతూ త‌మ ఆట‌తీరుతో ఎక్కువ ఓట్ల‌ను సంపాదించుకున్నారు. ఇన‌యా, నేహా, ఆరోహి డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో ఇన‌యా ఎలిమినేట్ అవుతుంద‌ని అంద‌రూ బావించారు. అయితే.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా చివ‌ర్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడంట‌.

గొడ‌వ‌లు ప‌డుతూ ఇన‌యా బాగానే కంటెంట్ ఇచ్చింద‌ని, దీంతో చివ‌రి నిమిషంలో ఆమె సేవ్ అయింద‌ని టాక్‌. ఈ వారం నేహా చౌద‌రి ఎలిమినేట్ అయింద‌ని లీక్ వీరులు చెబుతున్నారు. మ‌రీ దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Next Story