బిగ్‌ట్విస్ట్‌.. ఆమె సేఫ్.. అత‌డు ఎలిమినేట్‌..!

Bigg Boss Telugu 5 Jessie Is Evicted From The Show.బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది కంటెస్టెంట్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Nov 2021 9:30 AM GMT
బిగ్‌ట్విస్ట్‌.. ఆమె సేఫ్.. అత‌డు ఎలిమినేట్‌..!

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీదా, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలిమినేట్ అయిన వారిలో ఉన్నారు. ఇక‌ 10వ వారంలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నామినేషన్లలో రవి, మానస్, కాజల్, సన్నీ, సిరి ఉన్నారు. కాగా.. వీరిలో కాజ‌ల్‌కు అంద‌రి కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది కాజ‌ల్ ఎలిమినేట్ అవుతుంద‌ని బావించ‌గా.. బిగ్‌బాస్ స‌డెన్ ట్విస్ట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ వారం షో నుండి జెస్సీ ఎలిమినేట్ అయ్యాడ‌ని అంటున్నారు. అనారోగ్యం కార‌ణంగా అత‌డిని బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్‌లోకి పంపించి చికిత్స అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే.. అత‌డి ఆరోగ్యం మెరుగ‌వ్వ‌క‌పోవ‌డంతో జెస్సీని ఈ వారం ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించి వేశార‌ట‌. ఇక జెస్సీ తిరిగి వ‌స్తాడేమోన‌న్న సిరి, ష‌ణ్ముఖ్‌ల ఆశ అడియాశ‌లైన‌ట్లే. జెస్సీ ఎలిమినేట్ కావ‌డంతో కాజ‌ల్ గండం నుంచి బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు. మ‌రీ బిగ్‌బాస్ నిజంగానే జెస్సీని ఇంటికి పంపించాడా..? లేదా అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ వ‌ర‌కు ఆగాల్సిందే.

Next Story