బిగ్‌బాస్ బ్యూటీ సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్
Bigg Boss Fame Siri Hanmanth Tested Positive For Covid 19.దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2022 9:51 AM IST
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక చిత్రపరిశ్రమను ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారిన పడగా.. తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ సిరి హన్మంతుకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు వెల్లడించింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లో పాల్గొన్న సిరి హన్మంతు పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చుకుంది. అంతకముందు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్స్మ్ చూసేవారికి మాత్రమే సిరి తెలుసు. బిగ్‌బాస్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది సిరికి. అయితే.. హౌస్‌లో ఆటకంటే షణ్ముఖ్‌తో జస్వంత్‌తో రిలేషనల్‌షిప్‌లో ఉందన్న రూమర్స్‌తోనే ఎక్కువగా వార్తలో నిలిచింది. దీంతో 8 ఏళ్లు ప్రేమలో ఉన్న షణ్ముఖ్‌తో దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. వీరిద్దరి బ్రేకప్‌కు సిరినే కారణమనే వార్తలు రాగా.. వారిద్దరి బ్రేకప్‌కు తాను కారణం కాదని సిరి హన్మంతు స్ఫష్టం చేసింది.