బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబర్ సరయూ, ఆమె అనుచరులను బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ హోటల్ ప్రచార సాంగ్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించాని వీహెచ్‌పీ నేత ఫిర్యాదు చేశారు. సదరు వీడియో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్న అభియోగంపై 153a, 295a సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి సరయూను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సరయూ, ఆమె బృందం 7 ఆర్ట్స్ పేరుతో యూట్యూబ్‌లో ఓ ఛానెల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్ కోసం గతేడాది ఓ షార్ట్‌ఫిల్మ్‌ను తీశారు. ఆ షార్ట్‌ఫిల్మ్‌లోని పాట హిందూ సమాజాన్ని, మహిలలను కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును అక్కడి పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఫిలింనగర్‌లోని కార్యాలయంలో ఉన్న సరయూతో పాటు ఆమె బృంద సభ్యులైన దర్శక నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను సోమవారం రాత్రి అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.