సోషల్ మీడియా ఫేమ్, హిందీ బిగ్‌బాస్ -16 కంటెస్టెంట్ అబ్దు రొజిక్‌ను దొంగతనం కేసులో అబుదాబీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే అబ్దు రోజిక్‌ను దుబాయ్ విమానాశ్రయంలో అరెస్టు చేశారనే వార్తలను అతని టీమ్ తోసిపుచ్చింది. రోజిక్‌ను పోలీసులు అదుపులోకి మాత్రమే తీసుకుని, వివరణలు ఇచ్చిన తర్వాత విడుదల చేశారని బృందం స్పష్టం చేసింది.
అబ్దు రోజిక్ కు చెందిన ఎస్-లైన్ ప్రాజెక్ట్ ప్రకటన ప్రకారం, "మొదట, అతన్ని అరెస్టు చేయలేదు, అతన్ని పోలీసులు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అబ్దు రోజిక్ తన వివరణలు ఇచ్చిన తర్వాత విడుదల చేయబడ్డాడు. ఈరోజు దుబాయ్‌లో జరిగే అవార్డు ప్రదానోత్సవంలో ఆయన పాల్గొంటారు."
"రెండవది మీడియాలో సమాచారం సరైనది కాదు. అబ్దు రోజిక్ మరియు అతని ఇమేజ్‌ను రక్షించడానికి మేము అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము" అని ప్రకటనలో ఉంది.
తజికిస్థాన్‌కు చెందిన అబ్దు సింగర్‌గానూ పాపులర్. 2022లో అబుదాబీలో జరిగిన ఐఫా వేడుకల్లో హిందీ పాటలు పాడి బాలీవుడ్ దృష్టిలో పడ్డారు. దీంతో అదే ఏడాది జరిగిన హిందీ బిగ్‌బాస్-16లో అవకాశం వచ్చింది. కాగా అబ్దుకు కేసులు కొత్తేం కాదు. గతేడాది మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.