విడిపోయిన బిగ్‌బాస్ జంట
Bigg Boss couple Shamita Shetty Raqesh Bapat announce break-up.ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేము.
By తోట వంశీ కుమార్ Published on 27 July 2022 12:47 PM ISTప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేము. ఇక ప్రేమించుకున్న అందరూ పెళ్లి పీటలెక్కరు. కొన్ని కారణాల వల్ల వారు విడిపోతుంటారు. అలాగే బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పరిచయమై ఓ సెలబ్రెటీ జోడి షమితాశెట్టి, రాకేశ్ బాపత్ లు సంవత్సరం కూడా కాకముందే విడిపోయారు. తమ దారులు వేరని, అందుకనుగుణంగా తమ ప్రయాణాన్ని కొనసాగుతుందంటూ వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరి బ్రేకప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరిగా సినీ పరిశ్రమకు పరిచమైన షమితాశెట్టి.. అనుకున్న స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో గతేడాది బిగ్‌బాస్-ఓటీటీలో పాల్గొంది. అక్కడ ఆమెకు నటుడు రాకేశ్ బాపత్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. ఇక వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు అనే క్రమంగా విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు.
షమితా శెట్టి విడుదల చేసిన ఒక ప్రకటనలో గత కొద్ది రోజులుగా మేం కలిసి ఉండడం లేదని చెప్పింది.వారి మ్యూజిక్ వీడియోను షరా అభిమానులకు అంకితం చేసింది. 'మా బంధం పై స్పష్టత ఇవ్వడం ముఖ్యం. రాకేశ్ మరియు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. గత కొంతకాలంగా మేమిద్దరం కలిసి లేము. కానీ ఈ అందమైన మ్యూజిక్ వీడియో మాకు చాలా ప్రేమ మరియు మద్దతునిచ్చిన అభిమానులందరి కోసం. ఇకపై కూడా ఇదే విధంగా మీ ప్రేమని చూపిస్తారని ఆశిస్తున్నా 'అని షమితా పోస్ట్‌లో పెట్టారు.
ఇంతలో రాఖేష్ బాపట్ తన ప్రకటనలో ఇలా వ్రాశాడు "నేను మరియు షమితా ఇకపై కలిసి ఉండలేమనే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. విధి అసాధారణ పరిస్థితులలో మా మార్గాలను కలుసుకుంది. అందరికీ షరా కుటుంబానికి ధన్యవాదాలు. మీ అందరి మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మ్యూజిక్ వీడియో మీ అందరికీ అంకితం చేయబడిందని "ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపాడు.