తాను ప్రెగ్నెంట్ అంటూ త‌ల్లికి చెప్పిన అషూరెడ్డి.. చీవాట్లు, చావుదెబ్బ‌లు.. వీడియో వైర‌ల్‌

Bigg Boss beauty Ashu Reddy Pregnent Prank video goes viral.జూనియ‌ర్ స‌మంత‌గా సోష‌ల్ మీడియాలో పేరు తెచ్చుకున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2021 5:43 PM IST
తాను ప్రెగ్నెంట్ అంటూ త‌ల్లికి చెప్పిన అషూరెడ్డి.. చీవాట్లు, చావుదెబ్బ‌లు.. వీడియో వైర‌ల్‌

జూనియ‌ర్ స‌మంత‌గా సోష‌ల్ మీడియాలో పేరు తెచ్చుకున్న అషూరెడ్డి.. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో సెల‌బ్రెటీ స్టేట‌స్ అందుకుంది. పలు టీవీ చానెళ్లలో యాంకరింగ్ చేయడంతో పాటు సోష‌ల్ మీడియాలోనూ ర‌చ్చ చేస్తోంది. ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్ప‌టిక‌ప్పుడూ త‌న ఫోటోల‌ను పోస్టు చేయ‌డంతో పాటు యూట్యూబ్ వీడియోల‌తోనూ అల‌రిస్తోంది. ఈ క్ర‌మంలో త‌ను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానంటూ ఇంట్లో త‌న తల్లి ముందే ఓపెన్ అయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్రెగ్నెన్సీ పేరుతో మ‌మ్మీ పై ఫ్రాంక్ చేస్తున్నా అంటూ ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేసింది. ఆ వీడియోలో ఏముందంటే..? సోఫాలో కూర్చొని ఏడుస్తున్న అషూ రెడ్డిని ఏమైందని తల్లి ప్రశ్నించింది. 'నాకు పిరియడ్స్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని వచ్చిందని' చెప్పింది. అయితే.. ఈ విష‌యాన్ని మొదట్లో ఆమె తల్లి న‌మ్మ‌లేదు. జోక్ చేస్తోందని అనుకున్నారు. అయితే.. అషూ అదే ప‌నిగా ఏడుస్తుండ‌డంతో షాక్ అయిపోయి.. కాసేపు మౌనంగా ఉండిపోయింది.

ఏం చేయమంటావు అమ్మా అని అషు అడగ్గా.. 'ఏదైనా తాగి చద్దాం. నిన్ను ఇలా పెంచినందుకు నన్నే అంటారు.. 'అని అషు రెడ్డి తల్లి అన్నారు. ఆ తర్వాత కోపం ప‌ట్ట‌లేక‌.. అషు రెడ్డిని ఆమె త‌ల్లి కొట్టడం, కాలితో తన్నడం చేశారు. తల్లి కాళ్లు పట్టుకుని 'నాన్నకు చెప్పొద్దమ్మా' అంటూ బ్ర‌తిమిలాడింది. చివ‌ర‌కు కెమెరాలు చూపిస్తూ ఇది ఫ్రాంక్ వీడియో అమ్మా అని చెప్పింది.' నీకు ప్రాంక్‌లా ఉంది.. నాకు హార్ట్ ఎటాక్‌లా ఉంది.. ఇలాంటి విషయాలలో ఎవ‌రైనా జోక్ చేస్తారా ? ' అంటూ ఆమె త‌ల్లి మ‌ళ్లీ రెండు మొట్టికాయ‌లు అంటించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story