బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6.. రెండో వారంలో నామినేష‌న్‌లో ఉంది వీళ్లే

Bigg Boss 6 Telugu Second Week Nominations Check out who got Nominated.రెండో వారం నామినేష‌న్‌లో ఉంది వీళ్లే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2022 7:20 AM GMT
బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6.. రెండో వారంలో నామినేష‌న్‌లో ఉంది వీళ్లే

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 తొలి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొద‌టి వారంలో నో ఎలిమినేష‌న్ అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇవ్వ‌గా.. రెండో వారం నామినేష‌న్స్ ప్ర‌క్రియ మొద‌లు కాగానే మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు. ప్ర‌తిసారిలా ఇద్ద‌రు ఇంటి సభ్యుల‌ను కాకుండా కేవ‌లం ఒక‌రిని మాత్ర‌మే నామినేట్ చేయాల‌ని, నామినేట్ చేసేవారి పేరు చెప్పి వాళ్ల ఫోటో అతికించి ఉన్న కుండ‌ను బావిలో ప‌డేయాలని తెలిపాడు.

తొలుత ఆరోహి.. ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. అత‌డితో పెద్ద‌గా బాండింగ్ లేద‌ని చెప్పుకొచ్చింది. దీనికి కౌంట‌ర్‌గా ఆదిరెడ్డి మాట్లాడుతూ హౌస్‌లో గేమ్ ఆడ‌ని వాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేని వాళ్లు వెళ్లిపోవాలా అంటూ శివాలెత్తాడు. అనంత‌రం జంట‌గా వ‌చ్చిన మెరినా, రోహిత్‌ల‌ను నామినేట్ చేశాడు. ఫైమాను వాసంతి, ఆదిరెడ్డిని ఇన‌య‌, శ్రీహ‌న్, రేవంత్, చ‌లాకీ చంటి, సుదీప‌, ఆర్జే సూర్య‌ లు గ‌లాట గీతూని, షానీని అభినయ, శ్రీ సత్య లు నామినేట్ చేశారు.

చివ‌రిలో కెప్టెన్ బాలాదిత్య‌కు డైరెక్ట్‌గా ఇద్ద‌రిని నామినేట్ చేసే అధికారం ఇచ్చాడు బిగ్‌బాస్‌. షానీ, రాజ‌శేఖ‌ర్‌ల‌ను నామినేట్ చేశాడు బాలాదిత్య‌. మొత్తంగా రెండో వారం నామినేష‌న్‌లో రేవంత్‌, గీతూ, ఫైమా, అభిన‌య‌, ఆదిరెడ్డి, రాజ‌శేఖ‌ర్‌, మెరీనా అండ్ రోహిత్‌, షానీలు ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే చూడాలి.

Next Story