బిగ్‌బాస్ తెలుగు.. ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..?

Bigg Boss 5 telugu Sarayu may be eliminated.బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 తొలి వారం పూర్తి అయ్యింది. అప్పుడే తొలి ఎలిమినేష

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sep 2021 9:19 AM GMT
బిగ్‌బాస్ తెలుగు.. ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..?

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5 తొలి వారం పూర్తి అయ్యింది. అప్పుడే తొలి ఎలిమినేష‌న్ వ‌చ్చేసింది. కాగా నేడు ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వారం నామినేష‌న్‌లో యాంకర్‌ రవి, మోడల్‌ జెస్సీ, నటి హమీదా, యూట్యూబ్‌ స్టార్‌ సరయూ, నటుడు మానస్‌, ఆర్జే కాజల్‌ నామినేషన్‌లో ఉండ‌గా.. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో యాంక‌ర్ రవి, హ‌మీదా సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించారు. ఇక మిగిలిన న‌లుగురిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆర్జే కాజల్‌, నటుడు మానస్ కు భారీగా ఓట్లు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సరయూ, జెస్సీ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే.. ఈ ఇద్ద‌రిలో జెస్సీ.. జైలుకు వెళ్ల‌డంతో వారం చివ‌ర‌ల్లో సింప‌తీ ఓట్లు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం స‌ర‌యు ఎలిమినేట్ అవుతార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. 7 ఆర్ట్స్‌ సరయూ బిగ్‌బాస్‌ను వీడబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. చాలా మందిని షాక్‌కు గురిచేస్తోంది. మ‌రికొంద‌రు మాత్రం జెస్సీనే ఎలిమినేట్ అవుతాడ‌ని అంటున్నారు. అస‌లు ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story
Share it