బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే ఇంట విషాదం నెలకొంది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించింది. తల్లి మరణం పట్ల మెహబూబ్ ఓ సుదీర్ఘ పోస్టును షేర్ చేశాడు. "అమ్మా నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. నేను ఇకపై నిర్ణయాలు ఎలా తీసుకోవాలి..? నేను ప్రతీ రోజూ ఎవరితో మాట్లాడాలి..? నువ్వు లేకపోతే నేను ఎలా బతకాలి అమ్మా..? నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా."
"ప్రతి విషయంలోనూ నాకు సహకరించావు. నా ఎదుగుదలను చూస్తూ మురిసిపోయావ్.నా గెలుపోటముల్లో నువ్వు అండగా ఉన్నావ్ అమ్మా..నీ మాటలతో నాలో ఎప్పుడూ ధైర్యాన్ని నింపుతూ ప్రోత్సహించావ్.. అవే నన్ను ముందుకు నడిపించాయ్.. మా కోసం నువ్వు ఎంతో పోరాడావ్ అమ్మా. నువ్వు లేకపోవతే మా జీవితాలు ఎటు వెళ్తాయో అర్థం కావడం లేదు. ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అమ్మా. జీవితం అంటే ఏంటో నేర్పించావు. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తుంటావని తెలుసు. నిన్ను గర్వపడేలా చేస్తానమ్మ. తమ్ముడు శుభాన్, డాడీలను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. మాటిస్తున్నాను అమ్మా." అంటూ మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.