'బిచ్చ‌గాడు 2' చిత్ర ప్రారంభ స‌న్నివేశం చూశారా..? గూస్‌బంప్స్‌

Bichagadu 2 Sneak Peek Released.బిచ్చ‌గాడు చిత్రంతో తెలుగు అభిమానుల‌కు చేరువ అయ్యాడు విజ‌య్ ఆంటోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2023 12:22 PM IST
బిచ్చ‌గాడు 2 చిత్ర ప్రారంభ స‌న్నివేశం చూశారా..? గూస్‌బంప్స్‌

'బిచ్చ‌గాడు' చిత్రంతో తెలుగు అభిమానుల‌కు చేరువ అయ్యాడు విజ‌య్ ఆంటోని. అప్ప‌టి నుంచి ఆయ‌న న‌టిస్తున్న చిత్రాలు అటు త‌మిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌ల అవుతున్నాయి. విజ‌య్ ఆంటోని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బిచ్చ‌గాడు చిత్రానికి ప్ర‌స్తుతం సీక్వెల్ తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ద‌శ‌లో ఉంది. మలేషియాలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఇటీవ‌ల విజ‌య్ ఆంటోని తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విజ‌య్ 90 శాతం కోలుకున్నాడు. దీంతో మ‌ళ్లీ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు.

వేస‌విలో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాకాలు చేస్తున్నారు. అందులో భాగంగా చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు భిన్నంగా స్నీక్‌ పీక్ ట్రైల‌ర్ అంటూ చిత్ర ప్రారంభ సన్నివేశాన్ని విడుద‌ల చేశారు. 4 నిమిషాలు ఉన్న ఈ చిత్ర ప్రారంభ స‌న్నివేశంలో హీరో విజ‌య్ ఆంటోని ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

డ‌బ్బు ప్ర‌పంచానికి హానీ క‌రం అంటూ విడుద‌ల చేసిన ఈ స్నీక్‌ పీక్ ట్రైల‌ర్ చిత్రం పై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెర‌కెక్కుతోన్న‌ట్లు అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రానికి విజ‌య్ ఆంటోనే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అంతేకాకుండా సంగీతాన్ని కూడా తానే అందిస్తుండ‌డం విశేషం. కావ్య థాపర్ క‌థానాయిక కాగా.. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను డిస్నీ ప్లస్ హ‌ట్ స్టార్ సొంతం చేసుకుంది.

Next Story