హీరోయిన్ భూమికి కూడా కరోనా..ఆసుపత్రిలో చేరిన అక్షయ్..టెన్షన్ లో ఫ్యాన్స్..!

Bhumi Pednekar tests covid-19 positive.బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కూడా కరోనా బారిన పడ్డారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆస్పత్రిలో చేరానని అక్షయ్ అభిమానుల కోసం పోస్టు పెట్టాడు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2021 9:48 AM GMT
Bhumi Pednekar, Akshay Kumar

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే..! ఎంతో ఎనర్జీతో ఉండే అక్షయ్ కుమార్ ఆసుపత్రిలో చేరారనే విషయం పొక్కడంతో అభిమానులు కలవరపడ్డారు. కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని అక్షయ్ అభిమానుల కోసం పోస్టు పెట్టాడు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆస్పత్రిలో చేరానని.. తనపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు, మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞుడినై ఉంటానన్నాడు అక్షయ్. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాను. అతి త్వరలో క్షేమంగా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని సూచించాడు.

అక్షయ్ కుమార్ 'రామ్ సేతు' సినిమా షూటింగ్‌‌లో భాగంగా కరోనా టెస్టు చేయించుకుంటే కరోనా నిర్ధారణ అయింది. ముంబాయిలోని మడ్ ఐలాండ్‌లో షూటింగ్ జరుగుతోంది. 100 మంది పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్‌కు కరోనా సోకడంతో మిగతా నటీనటులు టెక్నీషియన్స్‌ అందరికి టెస్టులు చేయగా అందులో 45 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రామ్ సేతు చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. సినిమా షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

Advertisement

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ నటుడు, యురి సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ కు కూడా కరోనా సోకింది. బాలీవుడ్ కు చెందిన చాలా మంది కరోనా బారిన పడుతూ ఉన్నారు. మహారాష్ట్రలో పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ సినిమా షూటింగ్ లకు అనుమతులను ఇచ్చారు. ఎక్కువ మంది లేకుండా షూటింగ్ లు నిర్వహించుకోవాలని సూచించారు.


Next Story
Share it