అప్స‌ర రాణితో మాస్ మ‌హారాజ్ చిందులు

Bhoom Bhaddhal Lyrical Video Song .. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం క్రాక్‌. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న

By సుభాష్  Published on  13 Nov 2020 8:40 PM IST
అప్స‌ర రాణితో మాస్ మ‌హారాజ్ చిందులు

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం క్రాక్‌. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ఈ చిత్ర బృందం ఓ మంచి మాస్ సాంగ్‌ను అభిమానుల‌తో పంచుకుంది. భూమ్ బ‌ద్ద‌లు.. భూమ్ బ‌ద్ద‌లు.. నా ముద్దు సౌండ్ అంటూ సాగే ఈ పాట‌లో న‌టి అప్స‌ర రాణి ర‌వితేజ‌తో ఆడి పాడింది.

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ఈ పాట‌కు మంచి స్టెప్పులు వేయించారు. డాన్ శ్రీను, బ‌లుపు చిత్రాల త‌రువాత గోపించంద్ మ‌లినేని, ర‌వితేజ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఈ చిత్రంలో వ‌రల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, స‌ముద్ర ఖ‌ని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ సంగీత స్వ‌రాలు అందిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story