మ‌హాశివ‌రాత్రి కానుక‌.. భోళాశంక‌ర్ ఫ‌స్టు లుక్‌.. స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Bholaa Shankar first look Adipurush Release date fix.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం భోళా శంక‌ర్. మెహ‌ర్ ర‌మేష్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 9:58 AM IST
మ‌హాశివ‌రాత్రి కానుక‌.. భోళాశంక‌ర్ ఫ‌స్టు లుక్‌.. స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం 'భోళా శంక‌ర్'. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా హీరోయిన్‌. ఇక మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా 'వైబ్ ఆఫ్ భోళా' పేరుతో ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. జీపుపై మెగాస్టార్ చిరంజీవి కూర్చున్న ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మ‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు.

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం 'ఆదిరుపురుష్'. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ రావ‌ణుడి పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది. కాగా.. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. సంక్రాంతి కానుక‌గా 3డి ఫార్మాట్‌లో జ‌న‌వ‌రి 12, 2023 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story