అభిమానుల‌కు మెగా ట్రీట్‌.. చిరు న్యూ లుక్ అదుర్స్‌

Bhola Shankar movie release date announced.ఆగ‌స్టు 22 సోమ‌వారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2022 2:02 PM IST
అభిమానుల‌కు మెగా ట్రీట్‌.. చిరు న్యూ లుక్ అదుర్స్‌

ఆగ‌స్టు 22 సోమ‌వారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. కాగా.. ఒక రోజు ముందుగానే అంటే ఆదివారం నుంచే అభిమానుల‌కు స‌ర్ ఫ్రైజ్‌ల వెల్లువ మొద‌లైంది. చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల నుంచి కొత్త పోస్ట‌ర్ల అప్‌డేట్‌లు ఒక్కొక్క‌టిగా విడుద‌ల అవుతున్నాయి. అందులో భాగంగా మొద‌ట‌గా 'భోళా శంక‌ర్' చిత్రం నుంచి తొలి అప్‌డేట్‌ వ‌చ్చేసింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, కీర్తి సురేష్‌లు అన్నా చెల్లెల్లుగా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఈమేర‌కు కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో చిరంజీవి.. బ్లాక్ అండ్ వైట్ దుస్తులు ధ‌రించి క‌ళ్ల‌జోడు పెట్టుకుని య‌మా స్టైలిష్‌, యంగ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టిస్తోంది. త‌మిళ చిత్రం 'వేదాళం' రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Next Story