ప్రారంభ‌మైన 'భోళాశంకర్'

Bhola Shankar movie Pooja Ceremony.మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2021 5:08 AM GMT
ప్రారంభ‌మైన భోళాశంకర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'భోళాశంకర్'. ఈరోజు(గురువారం) ఉద‌యం 7.45 గంట‌ల‌కు అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి.. షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కె.రాఘ‌వేంద్ర‌రావు, వి.వి.వినాయ‌క్‌, హ‌రీశ్ శంక‌ర్‌, బాబీ, గోపిచంద్ మ‌లినేని, వంశీ పైడిప‌ల్లి, కొర‌టాల శివ పాల్గొని చిత్ర‌బృందానికి అభినంద‌లు తెలిపారు. ముహూర్త‌పు షాట్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు.. క్లాప్ కొట్ట‌గా మరో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును చిత్రబృందానికి అందించారు.

ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తోంది. తమిళంలో ఘ‌న విజ‌యం సాధించిన 'వేదాళం' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న‌ ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది.

ఇక చిరు న‌టిస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'ఆచార్య' చిత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌గా.. మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' చిత్రంలోనూ నటిస్తున్నారు. మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' కు ఇది రీమేక్.

Next Story
Share it