సౌండ్ ఆఫ్ భ్లీమ్లా నాయ‌క్ .. ప‌వ‌న్ అభిమానుల‌కి పూన‌కాలే

Bheemla Nayak Title Song out.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 12:11 PM IST
సౌండ్ ఆఫ్ భ్లీమ్లా నాయ‌క్ .. ప‌వ‌న్ అభిమానుల‌కి పూన‌కాలే

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'భీమ్లా నాయ‌క్‌'. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడిగా నిత్యామీన‌న్‌, రానాకు జోడిగా సంయుక్త మీన‌న్ న‌టిస్తున్నారు. తాజాగా చిత్రం అభిమానుల‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. 'సౌండ్ ఆఫ్ భ్లీమ్లా నాయ‌క్' పేరుతో ఈ చిత్రం నుంచి మూడో పాట‌ను విడుద‌ల చేసింది.

'లాలా భీమ్లా.. అడ‌వి పులి.. గొడ‌వ ప‌డి' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ర‌చించ‌గా.. త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. కౌండిన్య ఈ పాట‌ను ఆల‌పించారు. కాగా.. విడుద‌లైన కాసేప‌టికే ఈ యూ ట్యూబ్‌లో ఈ పాట దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వ‌రి 12, 2022న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story