హీరోయిన్ మెహ్రీన్ కు అలా ప్రపోజ్ చేశాడట..!

Bhavya went down on one knee and proposed to be underwater.కృష్ణగాడి వీర ప్రేమ గాథ, మహానుభావుడు, ఎఫ్-2 సినిమాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 11:03 AM GMT
హీరోయిన్ మెహ్రీన్ కు అలా ప్రపోజ్ చేశాడట..!

కృష్ణగాడి వీర ప్రేమ గాథ, మహానుభావుడు, ఎఫ్-2 సినిమాల ద్వారా సక్సెస్ అందుకున్న మెహ్రీన్ ప్రిజాదా.. అతి త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతోంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌ని పెళ్లాడ‌బోతోంది ఈ బ్యూటీ. మార్చి 12న వీరి నిశ్చితార్థం రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్ విల్లా ప్యాలెస్‌లో నిర్వహించారు. అతి తక్కువ మంది సమక్షంలో ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. గత ఏడాది వీరి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని అనుకున్నారు.. అయితే కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఏప్రిల్ లో మెహ్రీన్ పెళ్లి జరగనుందని అంటున్నారు.

ఇక మెహ్రీన్, భవ్య బిష్ణోయ్ లవ్ స్టోరీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే అతడు మెహ్రీన్ కు ప్రపోజ్ చేయడం. అండమాన్ లో ఎంతో రొమాంటిక్ గా మెహ్రీన్ కు ప్రపోజ్ చేసాడట. స్కూబా డైవింగ్ చేసినప్పుడు.. నీటిలో తనకు రవి బిష్ణోయ్ ప్రపోజ్ చేశాడని మెహ్రీన్ తెలిపింది. నీటి లోపల స్కూబా డైవింగ్ చేయగా.. అక్కడ 'విల్ యు మ్యారీ మీ' అనే బోర్డు ఉండగా.. అక్కడే మోకాళ్ళ మీద ఉండి మెహ్రీన్ వేలికి ఉంగరాన్ని తొడిగాడట భవ్య బిష్ణోయ్.

ఇక తాము డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నామని మెహ్రీన్ తెలిపింది. ఎంగేజ్మెంట్ నే జైపూర్ లో చేసుకున్నామని.. ఇక పెళ్లి ఇంకా గ్రాండ్ గా చేసుకోబోతున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పటికే పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం మెహ్రీన్ అనిల్ రావి పూడి 'ఎఫ్3' లో నటిస్తోంది.


Next Story
Share it