ఆకట్టుకుంటున్న భామా కలాపం ఫస్టు గ్లింప్స్
Bhama Kalapam First Glimpse out.యూజర్ల అభిరుచికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో
By తోట వంశీ కుమార్ Published on 16 Jan 2022 2:49 PM ISTయూజర్ల అభిరుచికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. టాక్ షోలు, కొత్త సినిమాలను అందిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది. తాజాగా మరో వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో 'డియర్ కామ్రేడ్' ఫేమ్ భరత్ కమ్మ నిర్మాణంలో 'భామా కలాపం' పేరుతో వెబ్ సిరీస్‌ను రూపొందించింది. త్వరలోనే ఆహాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు.
యూట్యూబ్ లో వంటల రెసిపీలు చేసే ఓ మహిళ అనుకోని విధంగా తనకు రాని, తెలియని వంటను చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..? ఎందుకు ఆమె ఆ విధంగా చేయాల్సి వచ్చింది అనేది సస్పెన్స్ గా చూపించారు. ఇక ప్రియమణి ఓ పెద్ద కత్తి పట్టుకుని టెన్షన్‌గా, భయంతో దేన్నో కట్ చేయడం అందులో చూపించారు. అయితే.. ప్రియమణి ఏం కట్ చేసింది అనేది మాత్రం చూపించలేదు. థ్రిల్లర్ అని చెప్పడంతో ప్రియమణి ఎవరినైనా హత్య చేసి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందా..? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో అభిమన్యు దర్శకత్వంలో తెరకెక్కిన భామ కలాపం పై అంచనాలు పెరిగాయి. ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.