'భళా తందనాన' టీజర్.. లంచం లేనిదే కంచం కూడా దొరకట్లేదు
Bhala Thandhanana Teaser out.జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2022 11:42 AM ISTజయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు దూసుకువెలుతున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'భళా తందనాన'. చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థెరిస్సా నటిస్తోంది. వారాహి చలన చిత్రం పతాకం పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజు నేచురల్ స్టాని విడుదల చేశారు.
టీజర్ ను విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'రాక్షసుడుని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. 'నీ దారిలో నువ్వు.. నా దారిలో నేను.. ఇద్దరి లక్ష్యం' ఒక్కటే అని డైలాగ్‌లు ఆకట్టుకుటున్నాయి. టీజర్‌లో శ్రీవిష్ణును మునుపెన్నడూ చూడని కోణంలో చూపించారు. ఇందులో శ్రీవిష్ణు క్రైమ్ రిపోర్టర్‌గా నటించాడు. అమాయకమైన, భిన్నమైన కోణంలో ఆలోచించే వ్యక్తిగా కనిపించనున్నాడు. క్యాథరిన్ ట్రెస్సా కూడా రిపోర్టర్‌గా కనిపిస్తుంది. పొలిటికల్ టచ్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల ను విశేషంగా ఆకట్టుకుంటుంది.
గరుడ రామ్, పోసాని కృష్ణమురళి, సత్య అక్కల, అయ్యప్ప పి. శర్మ, శ్రీనివాస్ రెడ్డి, చైతన్య కృష్ణ, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఫిబ్రవరిలో విడుదల కానుంది.