సినీ ఇండస్ట్రీలో విషాదం.. దర్శకుడు పినాకి చౌదరి కన్నుమూత

Bengali film director Pinaki Chowdhury passed away due to illness. జాతీయ అవార్డు గ్రహీత, బెంగాలీ చిత్రాల దర్శకుడు పినాకి చౌదరి దీర్ఘకాలిక అనారోగ్యంతో సోమవారం కోల్‌కతాలోని

By అంజి  Published on  25 Oct 2022 1:21 PM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. దర్శకుడు పినాకి చౌదరి కన్నుమూత

జాతీయ అవార్డు గ్రహీత, బెంగాలీ చిత్రాల దర్శకుడు పినాకి చౌదరి దీర్ఘకాలిక అనారోగ్యంతో సోమవారం కోల్‌కతాలోని తన నివాసంలో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 82 ఏళ్ల చౌదరికి భార్య, కొడుకు ఉన్నారు. అతను లింఫోమా, శోషరస వ్యవస్థ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు . ఒక నెల క్రితం ఆసుపత్రిలో చేరాడు. చివరి రోజుల్లో తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లాలని ఆస్పత్రి అధికారులు సూచించడంతో మూడు రోజుల క్రితం డిశ్చార్జి చేశారు. కాగా నిన్న పరిస్థితి విషమించడంతో చౌదరి కన్నుమూశారు.

చౌదరికి కళలు, సంగీతంలో వైవిధ్యమైన అభిరుచులు ఉన్నాయి. 1983లో సౌమిత్ర ఛటర్జీ, అమోల్ పాలేకర్, తనూజ, ఛాయాదేవి తదితరులు నటించిన 'చెనా అచ్చెనా' (తెలిసిన మరియు తెలియని) చిత్రానికి దర్శకత్వం వహించినప్పుడు చలనచిత్ర ప్రపంచంలోకి ప్రవేశించారు. అతను 1996లో 'షాంఘాత్' (సంఘర్షణ), 2007లో 'బాలీగంజ్ కోర్ట్' సినిమాలకు రెండు జాతీయ అవార్డులను అందుకున్నాడు. అతని ఇతర ముఖ్యమైన చిత్రాలలో 'కాకబాబు హియర్ గెలెన్?' (కాకబాబు ఓడిపోయాడా?), 'ఏక్ తుక్రో చంద్' (చంద్రుని ముక్క), 'ఆరోహన్' ఉన్నాయి.

Next Story