చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ సీనియర్ నటుడు అభిషేక్ ఛటర్జీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. ఆయన మరణానికి గల అసలు కారణాలను మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. అభిషేక్ మృతితో బెంగాలి చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలియజేశారు.
1985లో పాత్‌భోలా చిత్రంతో సినీ పరిశ్రమంలో అడుగుపెట్టారు. బెంగాలీలో దాదాపు 120 సినిమాలకిపైగా నటించాడు. 'ఓరా చార్జోన్', 'తుమీ కోటో సుందర్', 'సురర్ ఆకాశే', 'తూఫాన్', 'మర్యాద', 'అమర్ ప్రేమ్' లాంటి చిత్రాలు అభిషేక్ ఛటర్జీ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైన తనదైన ముద్ర వేశాడు. పలు సీరియళ్లలో నటించారు.