నంద‌మూరి అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఎన్టీఆర్ జ‌యంతి రోజున బాల‌య్య గ‌ర్జ‌న‌

BB3 Release on 28th may.నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BB3 (వర్కింగ్ టైటిల్) రిలీజ్ అప్‌డేట్ వ‌చ్చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Jan 2021 4:19 PM IST
BB3 Release on 28th May

నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చేసింది. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న BB3 (వర్కింగ్ టైటిల్) అప్‌డేట్ వ‌చ్చేసింది. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. గ‌తేడాది బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన BB3 ఫ‌స్ట్ రోర్ మిన‌హా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ విడుద‌ల కాలేదు. గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో వ‌రుస పెట్టి సినిమా రిలీజ్ డేట్స్ వ‌స్తున్నాయి. మ‌రి బాల‌య్య అప్‌డేట్ ఇంకా ఎప్పుడు వ‌స్తుంద‌ని అభిమానులు గోల చేస్తున్నారు.


ఈ త‌రుణంలో ఆదివారం ఓ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర‌బృందం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి నాడు మే 28న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ చిత్రానికి మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని త‌మ‌న్ అందిస్తున్నాడు. పూర్ణ‌, ప్ర‌గ్నాజైశ్వాల్‌లు క‌థానాయిక‌లు న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, సునీల్‌శెట్టి ప్ర‌తినాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాల‌య్య అఘోర పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు ఉన్నాయి.




Next Story