బాల‌య్య అభిమానుల‌కు శుభ‌వార్త.. ఉగాదికి డబుల్ ట్రీట్ ..!

BB3 look and title revealed in ugadi.బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో బాల‌కృష్ణ ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. BB3 అనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2021 1:00 PM GMT
బాల‌య్య అభిమానుల‌కు శుభ‌వార్త.. ఉగాదికి డబుల్ ట్రీట్ ..!

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో బాల‌కృష్ణ ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. BB3 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుతోంది. ఈ చిత్రంలో బాల‌య్య రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో కనిపించ‌నున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ కొంతసేపు అఘోరా గెటప్ లో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ అఘోరాగా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ లుక్ లో బాలయ్య ఎలా ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈచిత్రానికి సంబంధించిన ఓ వార్త వినిపిస్తోంది.

ఉగాది పండుగ‌ను పుర‌స్క‌రించుకుని BB3 టైటిల్‌ను విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోండ‌గా.. ఆ రోజు ఈ చిత్రంలోని అఘోరా లుక్‌ను కూడా రివీల్ చేయ‌బోతున్నార‌ట‌. టైటిల్‌తో పాటు ఊహించని గెటప్‌తో ఉన్న బాలకృష్ణ దర్శనం ఇస్తాడనే ఈ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే బాల‌య్య అభిమానులు ఒకే రోజు డ‌బుల్ ట్రీట్ ఖాయం. ఇక ఈచిత్రానికి 'గాడ్ ఫాద‌ర్' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ‌ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.Next Story
Share it