అల్లరోడి 'బంగారు బుల్లోడు' ట్రైల‌ర్

Bangaru Bullodu Trailer.అల్లరి నరేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బంగారు బుల్లోడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 12:22 PM GMT
Bangaru Bullodu Trailer

అల్లరి నరేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బంగారు బుల్లోడు. గిరి ప‌ల్లిక ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌రేష్ స‌ర‌స‌న పూజా జవేరి న‌టిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తున్నాడు.

బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలని తమ అవసరాల కోసం వాడుకొని తిరిగి బ్యాంకులో పెట్టే ఉద్యోగుల వల్ల 100 సవర్ల బంగారం దొంగతనానికి గురైతే ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించినట్లు తెలుస్తోంది. అలాగే పృథ్వీరాజ్, ప్ర‌వీణ్, వెన్నెల కిషోర్‌ల కామెడీ సినిమాకు అద‌న‌పు ఆకర్ష‌ణ‌. ఈ చిత్రం జ‌న‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

చాలా కాలంగా స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న అల్ల‌రి న‌రేష్‌.. ఈ చిత్రంపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందించగా.. ఎమ్.ఆర్ వర్మ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, ప్రవీణ్, జబర్దస్త్ మహేష్ తదితరులు నటించారు.


Next Story