పండ‌గ శోభ‌ను తెచ్చిన బంగార్రాజు ట్రైల‌ర్‌

Bangarraju trailer Out.కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న‌ చిత్రం బంగార్రాజు. సోగ్గాడే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2022 12:00 PM GMT
పండ‌గ శోభ‌ను తెచ్చిన బంగార్రాజు ట్రైల‌ర్‌

కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న‌ చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం వ‌స్తోంది. కల్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతిశెట్టి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఈ క్ర‌మంలో ఈ రోజు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

తండ్రీకొడుకులు ఇద్ద‌రిని ఒకే ప్రేమ్‌లో క‌నిపించ‌డంతో అక్కినేని అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇద్ద‌రు హీరోల భాష‌, మ్యాన‌రిజం అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు, ఉర్రూత‌లూగించే పాట‌ల క్లిప్‌ల‌తో ఈ ట్రైలర్ సంక్రాంతి పండుగ శోభను ముందుగానే తీసుకొచ్చిన‌ట్లు అనిపించింది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి ట్రైల‌ర్‌పై లుక్కేయండి.

Next Story
Share it