'బంగార్రాజు' టీజర్ అదిరింది.. సంక్రాంతి బ‌రిలోనే సోగ్గాడు

Bangarraju Teaser Out.కింగ్ నాగార్జున హీరోగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సోగ్గాడే చిన్నినాయ‌నా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 4:30 PM IST
బంగార్రాజు టీజర్ అదిరింది.. సంక్రాంతి బ‌రిలోనే సోగ్గాడు

కింగ్ నాగార్జున హీరోగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'సోగ్గాడే చిన్నినాయ‌నా' ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఆ చిత్రానికి స్వీకెల్‌గా 'బంగార్రాజు' మూవీ తెర‌కెక్కుతోంది. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ, నాగ‌చైత‌న్య‌కి జోడిగా కృతిశెట్టి న‌టిస్తున్నారు. ఇక కొత్త సంవత్స‌రం సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

టీజర్ చూస్తుంటే 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాని మించి ఈ చిత్రం ఉండబోతుందని అర్థం అవుతోంది. కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలే కాక యాక్షన్, డివోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య కూడా తండ్రి లాంటి క్యారెక్టర్ తో అదరగొట్టేసాడు. కృతి శెట్టి గ్రామ సర్పంచ్‌. ఆమెను ఆకట్టుకోవడానికి చై ఆమెను దేశానికి సర్పంచ్‌గా చేస్తానని చెప్పిన స‌న్నివేశం చాలా బాగుంది. ఇక అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

Next Story