'బంగార్రాజు' టీజ‌ర్‌.. అదిరిపోయిందంతే

Bangarraju Teaser Out.అక్కినేని నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య‌లు క‌లిసి న‌టిస్తున్న చిత్రం 'బంగార్రాజు'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2021 5:22 AM GMT
బంగార్రాజు టీజ‌ర్‌.. అదిరిపోయిందంతే

అక్కినేని నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య‌లు క‌లిసి న‌టిస్తున్న చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయ‌నా' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతు కు జోడిగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి క‌నిపించ‌నుంది.

ఈ రోజు చైతు పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. టీజర్ లో నాగచైతన్య మాస్ లుక్ లో కనిపించారు. బుల్లెట్ బండి పై నాగచైతన్య కనిపించి అందరినీ అలరించాడు. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర‌బృందం బావిస్తోంది. ఇప్ప‌టికే సంక్రాంతి బెర్తుల‌న్నీ ఖ‌రారు అయిన నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారా..? లేదా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story
Share it