అక్కినేని అభిమానుల‌కు పండ‌గే.. బంగార్రాజు నుంచి వ‌రుస అప్‌డేట్స్‌

Bangarraju First look release on November 22nd.అక్కినేని నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య‌లు క‌లిసి న‌టిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2021 11:53 AM IST
అక్కినేని అభిమానుల‌కు పండ‌గే.. బంగార్రాజు నుంచి వ‌రుస అప్‌డేట్స్‌

అక్కినేని నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య‌లు క‌లిసి న‌టిస్తున్న చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయ‌నా' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతు కు జోడిగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి క‌నిపించ‌నుంది. సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం బావిస్తోంది. ఈ నేథ్యంలోనే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

మొదటి సింగిల్ 'లడ్డుండా' సంచలన విజయం సాధించింది. కృతిశెట్టి పోషిస్తున్న నాగల‌క్ష్మీ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను రిలీల్ చేశారు. ఈ లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప‌ల్లెటూరి అందం అంతా ఆమెలోనే ఉందా అనిపించింది. ఇక అంద‌రూ బంగార్రాజు ఎలా ఉంటాడా అని ఎదురుచూస్తున్నారు. బంగార్రాజు ఫ‌స్ట్‌లుక్‌ను ఈనెల 22న సాయంత్రం 5.22కి విడుద‌ల చేయ‌నున్నారు. ఇక చైతు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ నెల 23న ఉద‌యం 10.23 గంట‌ల‌కు ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. వ‌రుస అప్‌డేట్‌ల‌తో అక్కినేని అభిమానులు పుల్ ఖుషీ కానున్నారు.

Next Story