బంగార్రాజు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Bangarraju First look out.అక్కినేని నాగార్జున న‌టించిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2021 7:44 AM GMT
బంగార్రాజు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

అక్కినేని నాగార్జున న‌టించిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి న‌టించారు. కాగా.. ఈచిత్రంలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రని ప్రధానంగా చేసుకొని ఇప్పుడు ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తున్నారు. నాగ్‌కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.

కాగా.. నేడు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను నాగ‌చైత‌న్య‌ విడుద‌ల చేశారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్‌లో నాగార్జున స్వ‌ర్గం నుంచి దిగుతున్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఈ చిత్రంలో రావుర‌మేశ్‌, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story
Share it