బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'బంగార్రాజు'

Bangarraju Day 2 Box Office Collection.అక్కినేని నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య హీరోలుగా న‌టించిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 3:44 PM IST
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బంగార్రాజు

అక్కినేని నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య హీరోలుగా న‌టించిన చిత్రం 'బంగార్రాజు'. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌లైంది. క‌రోనా కార‌ణంగా పెద్ద చిత్రాల‌న్నీ త‌ప్పుకోగా సోలోగా బ‌రిలోకి దిగిన బంగార్రాజు బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్నాడు. తొలి ఆటకే మంచి పాజిటివ్ టాక్ రావ‌డంతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.36 కోట్లు వ‌సూళ్లు చేసి స‌త్తా చాటాడు.

రూ.40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. రెండో రోజు నైజాంలో రూ.4.47 కోట్లు, సీడెడ్ రూ.3.46 కోట్లు, ఉత్తరాంద్రలో రూ.2.20 కోట్లు, ఈస్ట్‌లో 1.75 కోట్లు, గుంటూరులో రూ.1.78 కోట్లు, కృష్ణా రూ 96 ల‌క్ష‌లు, నెల్లూరులో రూ. 85 ల‌క్ష‌లు రాబ‌ట్టాడు. మొత్తంగా రెండు రోజుల్లో రూ.36 కోట్లు గ్రాస్ వ‌సూలు అయిన‌ట్లు చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. అందుకు సంబంధించిన స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని కూడా విడుద‌ల చేసింది.

అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈచిత్రంలో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ‌, చైతు కి జోడిగా కృతి శెట్టి న‌టించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతికి విడుదలైన ఏకైక పెద్ద సినిమా కావ‌డం.. అలాగే గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన స్టోరీ కావడం 'బంగర్రాజు'కు బాగా కలిసొచ్చిందని అంటున్నారు.

Next Story