బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఆ తప్పులు ఏమిటో.. థియేటర్లలో ఈ రచ్చ ఏమిటో..!

Bandla Ganesh Tweet Goes Viral. బండ్ల గణేష్ ట్వీట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ తో నెటిజన్స్ కు దొరికిపోయాడు.

By Medi Samrat  Published on  30 March 2021 9:12 AM GMT
Bandla ganesh tweet

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా ఇంగ్లీషులో స్పెల్లింగ్ మిస్టేక్ కు పాల్పడి దొరికిపోయాడు. నెటిజన్లు అది తప్పని సూచించడంతో మరోసారి కూడా తప్పుగా స్పెల్లింగ్ ను చెప్పి ట్రోలింగ్ కు గురయ్యాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు తప్పనిసరిగా ధరించాలంటూ హైదరాబాదు పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మాస్కు లేకపోతే జరిమానా తప్పదు అని హెచ్చరిస్తూ చలాన్లను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన బండ్ల గణేశ్ మాస్కు ధరించండి అనే ఉద్దేశంతో Where mask అని అన్నారు. కానీ అక్కడ ఉండాల్సిన పదం Wear. ఇదే విషయాన్ని నెటిజన్లు గుర్తించి బండ్ల గణేశ్ ను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన మరో పోస్టు పెట్టారు. ఈసారి కూడా ఆయన ఆ పదాన్ని సరిగ్గా రాయలేకపోయారు. ఈసారి Ware mask అని అన్నారు. దాంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్' ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేశారు. వైజాగ్‌ థియేటర్‌లో ట్రైలర్‌ చూసేందుకు పవన్‌ అభిమానులు ఎగబడ్డారు. కిక్కిరిసిన జనంతో అద్దాలు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వెళ్లిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

'కేవలం ట్రైలర్ కే అద్దాలు పగలకొట్టేస్తే రేపు సినిమా రిలీజ్ కు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. చాలా ఆకలి మీదున్నాం' అని వీడియోను పోస్టు చేయగా.. బండ్ల గణేష్ స్పందించారు. టేక్ కేర్ బ్రదర్ అంటూ చెప్పుకొచ్చారు.


Next Story