మా ఎన్నికలు.. వినూత్నంగా ప్రచారం చేస్తోన్న బండ్లగణేష్
Bandla Ganesh Special Campaign for MAA Elections.గతంలో ఎన్నడూ లేనంతగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు
By తోట వంశీ కుమార్
గతంలో ఎన్నడూ లేనంతగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకూ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మా అధ్యక్ష ప్రెసిడెంట్ పదవి కోసం ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యనే పోటి నెలకొని ఉంది. ఇప్పటికే ఇరువురు తమ తమ ప్యానల్స్‌ను ప్రకటించారు కూడా. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రకాశ్ రాజ్ తన ప్యానల్‌లో జీవిత రాజశేఖర్‌ను తీసుకోవడాన్ని వ్యతిరేకించి ఆ టీమ్ నుంచి బయటకు వచ్చారు బండ్లగణేష్. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తుండటంతో.. జీవితపై పోటీ చేయాలనే ఉద్దేశంతో జనరల్ సెక్రటరీ పదవి కోసం బండ్ల గణేష్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
@HeroManoj1 @themohanbabu @LakshmiManchu @LakshmiManchu @iVishnuManchu @prakashraaj @actorsrikanth pic.twitter.com/ThMytlgSKZ
— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2021
కాగా.. సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఓకే ఒక్క ఓటు, మా కోసం, మన కోసం, మనందరి కోసం, మా తరుపున ప్రశ్నించడం కోసం అని ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మీకు ఇష్టమున్న వాళ్లను ఎన్నుకోండి.. కానీ జనరల్ సెక్రటరీగా తననే గెలిపించాలని అభ్యర్థించారు. ఇండస్ట్రీలోని అగ్ర, యువ నటీనటులను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.