అఖండ.. తొలి రోజు ఎంత కొల్లగొట్టారంటే..!

Balakrishna's Akhanda Movie first day collections.నందమూరి బాలకృష్ణ న‌టించిన చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 7:05 AM GMT
అఖండ.. తొలి రోజు ఎంత కొల్లగొట్టారంటే..!

నందమూరి బాలకృష్ణ న‌టించిన చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టించింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రం నిన్న(డిసెంబ‌ర్ 2న) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసిన ప్రతి ఒక్కరు జై బాల‌య్య అనేలా అరుపులు పెట్టించిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. వ‌సూళ్ల ప‌రంగా అఖండ దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం హడావిడి చూసుంటే బాక్స్ ఆఫీస్ పై బాలయ్య దండయాత్ర మొద‌లైన‌ట్టుగా అనిపిస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ తరువాత ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా 'అఖండ' రికార్డును సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు సాధించింది.

ఏరియాల వారిగా కలెక్షన్లు..

నైజాం- రూ.4.39 కోట్లు

సీడెడ్- రూ.4.02 కోట్లు

గుంటూరు- రూ.1.87 కోట్లు

ఉత్తరాంధ్ర- రూ.1.36 కోట్లు

ఈస్ట్ గోదావరి- రూ.1.05 కోట్లు

వెస్ట్ గోదావరి- రూ.96 లక్షలు

కృష్ణా- రూ.81 లక్షలు

నెల్లూరు- రూ.93 లక్షలు

ఇక మొత్తంగా చూసుకుంటే.. ఈ చిత్రం 53 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన అఖండ మ‌రో రూ.35.26 కోట్లు రాబ‌ట్టిందంటే బ్రేక్ ఈవెన్ సాధించ‌డం ఖాయం. ప్ర‌స్తుతం ఉన్న ఊపు చూస్తుంటే.. ఆదివారం ముగిసే స‌రికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Next Story