"ఊర్వశివో రాక్షసివో" కోసం బాలయ్య.. అల్లు ఫ్యామిలీతో నందమూరి ఫ్యామిలీ ప్రత్యేక అనుబంధం !

Balakrishna will be the chief guest at the pre-release function of the movie “Urvashivo Rakshasivo”. నటసింహం బాలయ్య బాబు అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నారు. 'అన్ స్టాపబుల్' టాక్ షో కారణంగా అల్లు అరవింద్ కి

By Sumanth Varma k  Published on  27 Oct 2022 12:31 PM GMT
ఊర్వశివో రాక్షసివో కోసం బాలయ్య.. అల్లు ఫ్యామిలీతో నందమూరి ఫ్యామిలీ ప్రత్యేక అనుబంధం !

నటసింహం బాలయ్య బాబు అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నారు. 'అన్ స్టాపబుల్' టాక్ షో కారణంగా అల్లు అరవింద్ కి బాలయ్యకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఈ అనుబంధమే అల్లు శిరీష్ కి ప్లస్ కాబోతుంది. అల్లు శిరీష్ హీరోగా రాబోతున్న తదుపరి చిత్రం "ఉర్వశివో రాక్షసివో". ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బాలయ్య బాబు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడు. అక్టోబర్ 30న జేర్సీ కన్వెక్షన్ హాల్ లో జరనున్న ఈ భారీ ఈవెంట్ కి బాలయ్య స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు. మరీ బాలయ్య బాబు ఈ ఉర్వశివో రాక్షసివో గురించి ఎలాంటి పలుకులు పలుకుతాడో చూడాలి. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాలో శిరీష్,అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. "ఊర్వశివో రాక్షసివో" చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా పై అంచనాలు పెంచడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బాలయ్య బాబును తీసుకు వస్తున్నారు. మరీ ఈ సినిమా పై బాలయ్య ముద్ర పడితే.. కచ్చితంగా సినిమాకి ప్లస్ కానుంది.

Next Story
Share it