అభిమానుల‌తో క‌లిసి సినిమా చూసిన బాల‌య్య‌

Balakrishna Watching Veera Simha Reddy movie with fans.నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన చిత్రం వీర‌సింహారెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2023 10:03 AM IST
అభిమానుల‌తో క‌లిసి సినిమా చూసిన బాల‌య్య‌

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన చిత్రం "వీర‌సింహారెడ్డి". గోపించంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీంతో థియేట‌ర్ల వ‌ద్ద బాల‌య్య అభిమానుల సంద‌డి మామూలుగా లేదు. క‌టౌట్లు, పాల‌భిషేకాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బాల‌య్య అభిమానుల‌తో క‌లిసి "వీర‌సింహా రెడ్డి" చిత్రాన్ని వీక్షించారు. కూక‌ట్‌ప‌ల్లిలోని భ్ర‌మ‌రాంబ థియేట‌ర్‌లో ఈ చిత్ర బెనిఫిట్ షో వేశారు. అభిమానుల‌తో క‌లిసి చిత్రాన్ని చూడాల‌ని బావించిన బాల‌య్య అక్క‌డ‌కు వెళ్లారు. దీంతో థియేట‌ర్ ద‌గ్గ‌ర సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. నంద‌మూరి న‌ట‌సింహాన్ని చూసిన ప్రేక్ష‌కులు జై బాల‌య్య నినాదాల‌తో హోరెత్తించారు.

డ‌ప్పులు, బ్యాండ్ బాజాల‌తో త‌మ అభిమాన హీరోకు ఘ‌న స్వాగతం ప‌లికారు. అభిమానుల‌తో క‌లిసి సినిమా చూడ‌డం ఎంతో ఆనందంగా ఉందని, వారి స్పంద‌న చాలా బాగుంద‌ని ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ చెప్పుకొచ్చారు. ఇక బాల‌య్య ప్రేక్ష‌కుల మ‌ధ్య కూర్చోని సినిమా చూస్తున్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ న‌టించింది. ఈ చిత్రంలో బాల‌య్య దిపాత్రాభిన‌యం చేశారు. బెన్‌ఫిట్ షో చూసిన బాల‌య్య అభిమానులు బొమ్మ బ్లాక్ బాస్ట‌ర్ అని అంటున్నారు. విదేశాల్లో తెల్లవారుజామున 2 గంటలకే షోలు మొదలయ్యాయి.

Next Story