ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య.. ఏమన్నారంటే..?
Balakrishna talks JR NTR political entry.సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2021 6:14 AM GMTసీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. అదే వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అక్కడ కూడా తన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై అడిగిన ఓ ప్రశ్నకు బాలయ్య బాబు స్పందించారు. ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావడమనేది ఎవరి ఇష్టం వారిదని అన్నారు. వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. అయితే, ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తాను పెద్దగా ఆలోచించడంలేదని పేర్కొన్నారు.
అలాగే ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? అనే ప్రశ్నకు బాలయ్య ఎలాంటి సమాదానం ఇవ్వకుండా నవ్వి ఉరుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఫ్లస్ అయి మైనస్ అయితే అంటూ ఎదురు ప్రశ్నించారు. అంతకుముందు.. తన ఇద్దరు అల్లుళ్లకు ఎన్ని మార్కులు వేస్తారని అడుగగా.. ఇద్దరూ రాజకీయాల్లో రాణిస్తున్నారని, నాయకత్వ లక్షణాలు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలోంచి పుట్టిందని అన్నారు. ఇందులో క్లీన్ గా ఉండే వాళ్లకే పేరు, గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు.