కరోనా వ్యాక్సిన్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Balakrishna Sensational Comments On Corona vaccine... ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్‌పై

By సుభాష్  Published on  16 Nov 2020 12:09 PM IST
కరోనా వ్యాక్సిన్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు. అసలు వ్యాక్సిన్‌ రాదు.. అని అన్నారు. విర్గోపిక్చర్స్‌ బ్యానర్‌పై వస్తున్న 'సెహరీ' మూవీ ఫస్ట్‌లుక్‌ ను ఆయన సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వస్తుందని అంటున్నారు. ఇది నిజం కాదు. అసలు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశాలే లేవు.

కరోనా వైరస్‌ మన జీవితాంతంతో ఉంటుంది. దాంతో మనం సహజీవనం చేయాల్సిందే. ఈ రోజు కార్తీక సోమవారం. అయినా సరే తన స్నానాలు చేయవద్దు అని ఆయన అన్నారు. కరోనా కట్టడికి పలు దేశాల్లో వ్యాక్సిన్ పై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో వ్యాక్సిన్ ట్రయల్స్‌ మూడో దశ పూర్తి చేసుకుని అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.




Next Story