బాల‌య్య 107 మూవీ పిక్ లీక్‌.. వైర‌ల్‌

Balakrishna Pic leaked from NBK 107 Location.నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోలిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 8:14 AM GMT
బాల‌య్య 107 మూవీ పిక్ లీక్‌.. వైర‌ల్‌

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోలిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. బాల‌య్య కెరీర్‌లో 107వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతి హాసన్ న‌టిస్తోంది. అవుడ్ అండ్‌ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్‌ను గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్ర ఫ‌స్టు షెడ్యూల్ నిన్న‌(శుక్ర‌వారం) సిరిసిల్ల‌లో ప్రారంభ‌మైంది. అయితే.. అప్పుడే ఈ చిత్రంలోని బాల‌య్య లుక్‌కు లీకైంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. లీకైన ఈ ఫోటోను గ‌మ‌నిస్తే సినిమాలోని ఓ సీన్‌ను చిత్రీక‌రిస్తున్న‌ప్పుడు తీసిన ఫోటో గా క‌నిపిస్తోంది. ఈ ఫోటోలో బాల‌కృష్ణ గ‌డ్డంతో ర‌గ్గుడ్ లుక్‌తో మాస్ అవ‌తారంలో క‌నిపిస్తున్నాడు. ఇందులో సాహో ఫేం లాల్ కూడా ఉన్నాడు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.' క్రాక్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత‌ గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.


Next Story
Share it