బ్రేకింగ్‌.. 'అఖండ'గా బాలయ్య.. నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే

Balakrishna new movie title is Akhanda.ఉగాది పర్వదినం రోజున 'బీబీ3' సినిమా టైటిల్ 'అఖండ' రివీల్ చేసారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2021 1:02 PM IST
Akhanda

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఎప్పుడో ప్రారంభ‌మైనప్ప‌టికీ.. టైటిల్‌ను ప్ర‌క‌టించ‌కుండా ఆస‌క్తి పెంచింది చిత్ర‌బృందం. 'బీబీ3' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర‌ టైటిల్ తెలుసుకోవడానికి నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగువారు ప్రత్యేకంగా భావించే ఉగాది పర్వదినం రోజున 'బీబీ3' సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. చెప్పినట్టుగానే ఈ రోజు ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ 'అఖండ' అని టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో 'కారుకూత‌లు కూస్తే క‌పాలం ప‌గిలిపోద్ది అంటూ' బాల‌య్య చెప్పే డైలాగ్ అల‌రిస్తోంది. బాలయ్య స్వామిజీ లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చారు. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదు. ఈ వీడియో చూస్తే బాలయ్య అభిమానులకు ఊపు రాక మానదు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తోండ‌గా.. మ‌రో హీరోయిన్‌గా పూర్ణ న‌టిస్తోంది. శ్రీకాంత్, జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆల‌య్యా మీరు ఓ సారి వీడియోను చూసేయండి.


Next Story